నాణ్యమైన విద్యపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడను గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణ తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్, క్రీడల గదులతో పాటు డిజిటల్ బోర్డులను..
రామగిరి, జూన్ 11 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడను గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణ తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్, క్రీడల గదులతో పాటు డిజిటల్ బోర్డులను, వంటగది, డైనింగ్ హాల్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంపైనే ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. పాఠశాల ద్వారా గుణాత్మక విద్యతో పాటు, పరిసరాలు కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, తరగతి గదులు, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ నెల 15న పాఠశాల పునప్రామనాటికి చికెన్ చేయాలని కోరారు. అలాగే తరగతి గదిలో ఏసీలు వినియోగించేటప్పుడు తరగతి గదులు మూసి ఉంచాలని, పాఠశాలలోని లైబ్రరీ, గేమ్స్ ,ఇతర అన్ని పరికరాలు విద్యార్థులు వినియోగించుకునే విధంగా చూడడమే కాకుండా వాటిని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. పాఠశాలలో పచ్చదనం ఉండే విధంగా మొక్కలకు నిరంతరం నీరంందించాలని, మొక్కలు ఎండిపోకుండా చూడాలని, పాఠశాల ఆవరణలోకి వాహనాలు రాకుండా చూడాలన్నారు. ఆయన వెంట నల్లగొండ ఎంఈఓ అరుంధతి, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

నాణ్యమైన విద్యపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

