– ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి డిమాండ్
రామగిరి, డిసెంబర్ 20 : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. నివారం సాయంత్రం నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయులకు అందాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, టీజీఎల్ఐ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే నల్లగొండ చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులపై అకారణంగా తీసుకున్న చర్యలను తక్షణం రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ, టీఎస్‌యూటీఎఫ్, డీటీఎఫ్, టీఆర్టీఎఫ్, టీపీయూఎస్, టీపీటీఎఫ్ నాయకులు ఎం.రాజశేఖర్ రెడ్డి, పేరుమాల్ల వెంకటేశం, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, సుంకరి భిక్షం గౌడ్, నల్లపరాజు వెంకన్న, ఎం.వెంకులు, ఆయా సంఘాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.