మిర్యాలగూడ టౌన్, జూలై 5 : వయసు చిన్నది. ఆసక్తి మాత్రం పెద్దది. ఈ ఆసక్తిని చిత్రకళలో చూపిస్తూ పలు కళా సంస్థలు నిర్వహించే చిత్రకళా పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకుంటున్నారు మిర్యాలగూడ రెడ్డికాలనీకి చెందిన కవలలు పేలప్రోలు ఆద్య, ఆర్య. వీరి తల్లిదండ్రులు ప్రసాద్, భాను పిల్లల ఆసక్తిని గమనించి పట్టణానికి చెందిన చిత్రకారుడు ఇనుగుర్తి విజయ్‌కుమార్ వద్ద నాలుగేండ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. నిరంతర సాధన, ఉత్తమ శిక్షణతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుపొందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. వీరు వేసిన డ్రాయింగ్, షేడింగ్ చిత్రాలు దాదాపు 200 పైగా ఉన్నాయి. ప్రకృతి, కరోనా, సేవ్ నేచర్, సేవ్ వాటర్, పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలపై వేసిన చిత్రాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. వీరి ప్రతిభను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నగదు పారితోషికం అందజేశారు.
ఆద్య గెలుపొందిన అవార్డులు.. .
ఆర్య గెలుపొందిన అవార్డులు..