నల్లగొండ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.