తుంగతుర్తి, నవంబర్ 21 : శీతాకాలంలో నిర్వహించే కరాటే ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ బొంకురి అరుణ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు మూడు నెలల పాటు కరాటే శిక్షణను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సినీ హీరో సుమన్ తల్వార్, తమ గురువైన మాస్టర్ బూడిద సైదులు సహకారంతో శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ శిబిరాన్ని మండల కేంద్రంలోని (ఎంపీపీఎస్) మండల పరిషత్ పాఠశాల మర్రిచెట్టు దగ్గర ఏర్పాటు చేయిస్తున్నట్లు, సమయం ఉదయం 6:00 నుండి 7 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.