నల్లగొండ, ఆగస్ట్ 10. నల్లగొండ జిల్లా కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యత లు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , నల్లగొండ అర్.డి. ఓ జగన్నాథరావు కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న టి.వినయ్ కృష్ణా రెడ్డిని నల్లగొండ జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.