దేవరకొండ రూరల్, జనవరి 22 : దేవరకొండ నియోజకవర్గ ముస్లిం మత పెద్ద, నూతన ముఫ్తీగా, ఖాతీబ్ – ఏ – ఈదెన్ గా ముఫ్తీ సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి ఎంపియ్యారు. ఈ నెల 18న స్థానిక మక్కా మస్జీద్ లో జరిగిన దేవరకొండ ఈద్గా కమిటీ సమావేశంలో అందరి అభిష్టం మేరకు ముఫ్తీ సయ్యద్ అంజద్ అలీ ఖాస్మి పేరును ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీమోద్దీన్ ప్రతిపాదించారు. దీంతో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం పలికారు. దేవరకొండ ముఫ్తీ హాజ్రత్ మహ్మద్ జావీద్ హుస్సేన్ ఖాస్మి రహ్మతుల్లా అలైహి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రహత్ అలీ, గౌరవ అధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, జావీద్ అలీ, జనరల్ సెక్రటరీ ఎండీ ఇలియాస్ పటేల్, ఉపాధ్యక్షులు జాఫర్ ఖాన్, ఎండీ షబ్బీర్, సెక్రటరీ ఇలియాస్ బాబా, జాయింట్ సెక్రటరీలు ఖైసర్, అఫ్రోజ్, సహాయ కార్యదర్శులు ముజీబ్, సయ్యద్ అజీజ్, సభ్యులు ఖుద్రతుల్లాహ్, సయ్యద్ దస్తగిర్, ఎండీ సలీమ్, హమీద్, షకీల్, ఖాజా, షఫి, మంజూర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు ఫయాజ్ పాల్గొన్నారు.