కోదాడ టౌన్, ఏప్రిల్ 24 : కోదాడ స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ తాసీల్దార్ వాజిద్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైటెక్ చలివేంద్రం వద్ద దాతలు పందిరి సత్యనారాయణ, షర్మిల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు దాతలు ముందుకు వచ్చి చేయూతనందించడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో గరినే శ్రీధర్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఓరుగంటి కిట్టు, ఉపాధ్యక్షుడు యాద సుధాకర్, సభ్యులు గుడుగుంట్ల సాయి, వెంకటరమణ, సుధాకర్, శ్రీనివాసరావు, హైమావతి, రంగారావు, సురేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.