సూర్యాపేట, మార్చి 12 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. మార్కెట్ చైర్మన్‌గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్‌గా గట్టు శ్రీనివాస్, సభ్యులుగా ధరావత్ వీరన్న నాయక్, దాసరి తిరుమలరావు, నకిరేకంటి బాలకృష్ణ, పి.వెంకన్న, గొపగాని పెదవెంకన్న, ఎం.దామోదర్‌రెడ్డి, ఏ.కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నరసింహాచారి, షేక్ అబ్దుల్ కరీం, ఉప్పల సత్యనారాయణ, మాడ్గుల నవీన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో రైతులకు అండగా ఉంటూ వారు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. త్వరలో సూర్యాపేట మార్కెట్లో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తమ పాలకవర్గం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున మార్కెట్‌కు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు చైర్మన్‌ను గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు.