ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నడిగూడెం, ఆగస్టు 26 : దళితుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కోటయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు తరహాలోనే దళితులందరికీ దళిత బంధు సీఎం కేసీఆర్ అమలు చేస్తారని తెలిపారు. తరతరాలుగా అణచివేతకు గురైన దళిత జాతిలో సరికొత్త విప్లవానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తామంటే ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ ఇప్పుడు నిమిషంపాటు కరెంటు పోయిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు ఎన్నో అపోహలు, అనుమానాలను సృష్టిస్తాయని అన్నారు. ఈ దళిత బంధు పథకంపై దళిత నాయకులు, మేధావులు, కవులు ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. అట్టడగున దళితులను ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం దళిత బంధు అని అన్నారు. అనంతరం దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, దళిత సర్పంచులు యాతాకుల వీరస్వామి, స్వరూపావెంకన్న, నాగేశ్వర్రావు, ఎంపీటీసీ గోలి సునీత, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, ఉద్యోగుల సంఘం నాయకులు దున్నా శ్యామ్, ఈదయ్య, దాసరి శ్రీను, సుధాకర్, నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, దేవబత్తిని సురేశ్, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, ఖలీల్, వెంకన్న, ఉపేందర్, సతీశ్ పాల్గొన్నారు.
ఉచిత కరెంట్ మీటర్ల పంపిణీ
కోదాడ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంటు మీటర్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం పంపణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కరెంటు మీటర్లను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ప్రతి నెలా 250యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి , జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండ సైదయ్య, డీఈ శ్రీనివాసులు, ఏడీఈ రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, మధుసూదన్, ఉపేందర్‌గౌడ్, రజక సంఘం నాయకులు రాధాకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సత్యనారాయణ, అలసాగని జనార్దన్, శ్రీనివాస్‌రావు, ఏఈ సైదా, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.