నీలగిరి, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో ఉత్తమ సేవలందించిన 35 మంది అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రశంసాపత్రాలు అందించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా వారికి మెమెంటోలు అందించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 12 మంది ఉత్తమ అధికారులను గుర్తించిన పోలీస్ యంత్రాంగం కరోనా, లాక్డౌన్ కారణంగా ప్రశంసా పత్రాలు అందించలేక పోయింది. వారికి కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందజేశారు.
అవార్డులు అందుకున్న వారిలో డి.వినయ్‌కుమార్(ఎస్ఐ వాడపల్లి), టి. శ్రీను (కానిస్టేబుల్, డీటీసీ), ఎస్.రామలింగయ్య (కానిస్టేబుల్, క్లూస్‌టీమ్), పి.సత్యనారాయణ ( ఏఎస్ఐ, పీసీఆర్, నల్లగొండ), డి.సురేందర్‌రెడ్డి (కానిస్టేబుల్, ఐటీ సెల్), ఎంఏ మజీద్ (కానిస్టేబుల్, ఐటీసెల్), ఆర్.ఆంజయ్య (ఏఎస్ఐ, కట్టంగూర్), ఎల్.శ్రీరాములు (కానిస్టేబుల్, వన్‌టౌన్ నల్లగొండ), ఎండీ ఖదీర్ అహ్మద్ (కానిస్టేబుల్, దేవరకొండ), ఏ.రఘుమారెడ్డి (కానిస్టేబుల్, దేవరకొండ), కె.రవి (కానిస్టేబుల్, హలియా), ఎన్.చందూలాల్(ఏఆర్ ఎస్ఐ, నల్లగొండ), బి.గిరిధర్ (ఏఆర్ హెచ్‌సీ, నల్లగొండ), పి.రామ్మూర్తి (ఏఆర్పీసీ, ఎంటీ వింగ్), ఆర్.నరేశ్(ఏఆర్పీసీ, జిల్లా స్పెషల్ పార్టీ), ఎన్. వెంకటేశ్వర్లు (ఏఆర్పీసీ, జిల్లా స్పెషల్ పార్టీ), డి.కిరణ్ (ఏఆర్పీసీ, జిల్లా వెల్పేర్ వింగ్), ఎండీ గౌస్‌మియా (సీనియర్ అసిస్టెంట్, డీపీఓ), ఏ.లక్ష్మీనారాయణ (జూనినియర్ అసిస్టెంట్, డీపీఓ), ఎం.భారతీ (జూనియర్ అసిస్టెంట్, డీపీఓ), బి. అంజిరెడ్డి (హోంగార్డు, డీపీఓ), జె.వెంకట్‌రెడ్డి (హెడ్ కానిస్టేబుల్, డీఎస్బీ నల్లగొండ), పి.శంకర్ (కానిస్టేబుల్, డీఎస్బీ నల్లగొండ), ఎస్.లింగయ్య (కానిస్టేబుల్-డీసీఆర్బీ,నల్లగొండ), ఎస్.శ్రీనివాసన్ (కానిస్టేబుల్-సీసీఎస్నల్లగొండ), జి.విష్టువర్ధనగిరి (కానిస్టేబుల్-సీసీఎస్,నల్లగొండ), కె.రమేశ్ (కానిస్టేబుల్-షీ టీమ్), పి.ఝాన్సీ (కానిస్టేబుల్-మహిళా పోలీస్ స్టేషన్), బి.శ్రీనివాస్(కానిస్టేబుల్-ఐటీ అండ్ సీ, నల్లగొండ), డి.వెంకట్‌రెడ్డి(కానిస్టేబుల్, ట్రాఫిక్ నల్లగొండ), ఆర్. శ్రీరామ్(ఏఆర్పీసీ, నల్లగొండ), ఎండీ సలీం (హోంగార్డు, ఎఫ్పీ యూనిట్), ఎం.చిన్నా (హోంగార్డు, దేవరకొండ), సీహెచ్. చిరంజీవి (హోంగార్డు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్), వై.వెంకటేశ్వర్లు (హోంగార్డు) ఉన్నారు.
ఎన్.యాదగిరి (ఏఎస్ఐ, నార్కట్‌పల్లి), ఏ. జయరాజు (ఏఎస్ఐ,డిండి), ఎం.పూల రంగయ్య (ఏఆర్ఎస్ఐ,నల్లగొండ), పి.జయపాండరి (ఏఆర్ఎస్ఐ,నల్లగొండ), వి.శ్రీను(హెడ్ కానిస్టేబుల్, డీసీఆర్బీ నల్లగొండ), ఎన్.కాంతారావు(ఏఆర్ హెడ్ కానిస్టేబుల్,నల్లగొండ), ఏ.రమేశ్(కానిస్టేబుల్,తిప్పర్తి), డి. శ్రీనివాస్‌రెడ్డి(కానిస్టేబుల్,సెఫ్టీ వింగ్), బి.వెంకన్న(కానిస్టేబుల్, కట్టంగూర్), ఎం.రాములు (కానిస్టేబుల్,కేతేపల్లి), ఎం.శ్రావణ్‌కుమార్(కానిస్టేబుల్, గుర్రంపోడ్), కె.రమేశ్‌బాబు(కానిస్టేబుల్, మహిళా పోలీస్‌స్టేషన్)