చండూరు, ఏప్రిల్ 11 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు రావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుబే బండా శ్రీశైలం అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో, నేర్మట గ్రామంలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మోదీ సర్కార్ దేశ వ్యాప్తంగా రైతాంగానికి నష్టం కలిగించేటువంటి నాలుగు చట్టాల్ని రైతుల మీద బలవంతంగా రుద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు చట్టం తీసుకొస్తానని రాతపూర్వకంగా రాసిచ్చి ఎన్నికల తర్వాత మళ్లీ మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న మోదీ సర్కార్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఇప్పటికైనా మోదీ సర్కార్ మద్దతు ధర చట్టం తేవాలని, రైతాంగ ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షం కారణంగా తడిస్తే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అన్ని రకాల ధాన్యాలకు సన్న, దొడ్డు రకాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, రైతు సంఘం నాయకులు మోగుదాల వెంకటేశం, ఈరటి వెంకటయ్య, కొత్తపల్లి నరసింహ, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, బల్లెం స్వామి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, కావలి భిక్షం, దోటి జగన్, కావలి చిరంజీవి, గాలెంక నరేశ్, శేఖర్, పాశం శేఖర్, బోమ్మరగోని లింగస్వామి, వెంకన్న పాల్గొన్నారు.