సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 25 : ట్రాఫిక్ పోలీసులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమ్మర్ కిట్స్, హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి జాగ్రత్తలు పాటించాలన్నారు. వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడకుండా వారి సంక్షేమంలో భాగంగా చలువ అద్దాలు, వాటర్ బాటిల్స్, వైట్ క్యాపులు, హెల్మెట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ముడ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్ఎస్ఐ అఖిల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.