సూర్యాపేట టౌన్, మే 02 : చిన్నారుల శారీరక దృఢత్వం, సృజనాత్మకత పెంపు కోసం పోలీస్ వేసవి వినోద శిబిరం దోహద పడుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు వేసవి వినోద శిబిరంను ప్రారంభించి ఆయన మాట్లాడారు. వేసవిలో విద్యార్థులు, పోలీసు పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యోగా, డాన్స్, క్రీడలు, నాటికలు, పెయింటింగ్స్ లాంటివి పిల్లల మానసిక ఉల్లాసానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగ పడతాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుంచే కష్టపడే తత్వాన్ని అలవాటు చేస్తూ గెలుపు, ఓటమిలను ఒకేవిధంగా తీసుకునేలా ప్రేరేపించాలని సూచించారు.

సృజనాత్మకత పెంపునకు వేసవి శిబిరాలు దోహదం : ఎస్పీ నరసింహ
సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ నుండి దూరంగా ఉంచాలన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సబ్సిడరీ సెంట్రల్ క్యాంటీన్, అత్యాధునిక వ్యాయామశాల ఏర్పాటుతో పాటు వాలీబాల్, క్రికెట్, పరేడ్ మైదానాలను అభివృద్ధి చేశామన్నారు. పోలీసు వినోద శిబిరానికి హాజరైన విద్యార్థులు, పిల్లలతో కలిసి ఎస్పీ సరదాగా కాసేపు గడిపి క్రీడలు ఆడారు. యోగా, జుంబా డాన్స్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో అకాలంగా మరణించిన పోలీసు సిబ్బందికి ఈ నివాళి ఘటించారు. పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను సన్మానించి నగదు ప్రోత్సాహకం అందించారు.

సృజనాత్మకత పెంపునకు వేసవి శిబిరాలు దోహదం : ఎస్పీ నరసింహ
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అర్ముడ్ డీఎస్పీ నరసింహ చారి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, రాజశేఖర్, అర్ఐలు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఎస్ఐలు సాయిరాం, శ్రీకాంత్, ఐలయ్య, మహేష్, సైదులు, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ఎస్ఐ సురేష్, హోంగార్డ్స్ ఆర్ఎస్ఐ అశోక్, స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అశోక్, టెక్నికల్ టీం ఆర్ఎస్ఐ రాజశేఖర్, భరోసా సెంటర్ ఎస్ఐ మౌనిక, షీ టీం సిబ్బంది, ఆర్మూడ్ పోలీస్ సిబ్బంది, సూర్యాపేట పట్టణ, రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.