సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 18 : సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసరుగా బి.సులోచన రాణి శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న డీఐఈఓ భాను నాయక్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సులోచన రాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ పదోన్నతిపై సూర్యాపేట డీఐఈఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, ఆయా సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ భాను నాయక్, రాజమోహన్, రమణారెడ్డి, యాదయ్య, ఆయా సంఘాల నాయకులు విడిఎస్ ప్రసాద్, డాక్టర్ మద్దిమడుగు సైదులు, గుంటుపల్లి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, వాసు, గురువయ్య, సైదులు, శ్రీధర్, జి.వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసులు, జి.నవీన్ కుమార్, సిహెచ్.కృష్ణ, దశరథ, ప్రతాప్, ఉపేందర్, రవి, జనార్దన్ రెడ్డి, శ్రీను, సతీష్, శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డీఐఈఓ సులోచన రాణి మాట్లాడుతూ.. జిల్లాలో అందరూ ప్రిన్సిపాల్, అధ్యాపకలు, అధ్యాపకేతర సిబ్బంది సహకారంతో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేస్తానని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం ఇంకా అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచాలని సూచించారు. అడ్మిషన్లు పెంచుటకు, అత్యధిక ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు.