కట్టంగూర్, జూలై 30 : విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికాయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో నాణ్యమై భోజనంతో పాటు సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయ పాలన అలవర్చుకోవాలన్నారు. ఏకాగ్రతతో చదివితే మరింత ముందుకు వెళ్లగలరన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి గుజ్జుల శంకర్ రెడ్డి, సిబ్బంది వెంకట్ రెడ్డి, నర్సింహ్మ పాల్గొన్నారు.