చండూరు, ఆగస్టు 15 : విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎంసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మంచికంటి వెంకటరమణ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోడంగిపర్తి మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శుక్రవారం రూ.20 వేల విలువైన బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలను, ల్యాబ్‌కు కావాల్సిన పరికరాలను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి, ట్రస్ట్ ట్రెజరర్ మంచికంటి గోపీనాథ్, మంచికంటి గోపమ్మ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గంగాధర్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు బ్రహ్మచారి, శంకర్ రెడ్డి, పావని, నాగమణి, అనిల్ కుమార్, శ్యామ్, చౌకీసింగ్, ప్రసాద్, శ్రీనివాస్, నరేశ్, సుధాకర్, నవ్య పాల్గొన్నారు.
Chandur : విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : మంచికంటి వెంకటరమణ