– నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
రామగిరి, మే 16 : విద్యార్థులు చదువుతో పాటు, కళలు, చేతి వృత్తుల పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్, క్రాఫ్ట్ ,కల్చర్ పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, డైట్ చార్జీలు, మెనూను పెంచడం జరిగిందని తెలిపారు. అన్ని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కామన్ మెనూను తీసుకువచ్చి విద్యార్థుల పౌష్టికాహారాన్ని పెంపొందించేందుకు దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.

‘విద్యార్థులు చదువుతో పాటు కళలు, చేతి వృత్తుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి’
వచ్చే విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభమైన తర్వాత పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుకోవచ్చని, చదువుతో పాటు, క్రీడలు, ఇతర అన్ని రకాల నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకునేందుకు ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లులకు పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

‘విద్యార్థులు చదువుతో పాటు కళలు, చేతి వృత్తుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి’

‘విద్యార్థులు చదువుతో పాటు కళలు, చేతి వృత్తుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి’