కట్టంగూర్, నవంబర్ 26 : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ బూరుగు శారదారాణి, ఎన్జీఓ ఆశ్రిత అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధ్వర్యంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువు ద్వారానే విద్యారుల్లో మంచి భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. ప్రజలకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం చట్టాలపై అవగాహన లేకపోవడమేనన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్ధినులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్కుమార్, వార్డెన్ జయమ్మ, ఉపాధ్యాయులు రమాదేవి, కల్పన, రాజిరెడ్డి, కృష్ణమాచారి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.