మునుగోడు, మే 25 : మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ హైస్కూల్లో 2005-2006 టెన్త్ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.19 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాదగోని భిక్షంగౌడ్, చంద్రమౌళిగౌడ్, వినోద, శివ, లూథర్రాజు, రషీద్, ఉస్మాన్, మహేశ్, వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు కేశనబోయిన మల్లేశ్, చందపాక నాగరాజు, మక్సూద్, బండారు భాస్కర్, శేఖర్, వెంకటేశ్, విజయ్, గణేశ్, సుష్మ, మంజుల, లలిత, శ్రావణి, బాలమణి, రాధ, ధనమ్మ, జ్యోతి, పృద్వి, ధనలక్ష్మి పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని మాదారం కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97బ్యాచ్ పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు చదువు చెప్పిన గురువులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, అనంతుల సత్యనారాయణగౌడ్, పుట్టబత్తల పార్థసారథి, వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాలలో 2009-10 టెన్త్ బ్యాచ్, గుర్రంపోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-1996 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఎస్ఐ పసుపులేటి మధు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమకు చదువు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వద్దిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు వద్దిరెడ్డి నరసింహారెడ్డి, రావుల వెంకటనారాయణ గౌడ్, పన్నాల గోపాల్, మల్లేశం, పూర్వ విద్యార్థులు వెంకట్‌రెడ్డి, రేపాక కోటేశ్, శివరాజ్, జగపతిబాబు, గాసీరాం, జానిపాషా, కంచర్ల భవాని, రాజేశ్వరి, దామ కవిత, రాధిక, జడ్పీహెచ్ఎస్లో అప్పటి ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఎండీ రషీద్, ఏలూరి అశోక్కుమార్రావు, ఏలూరి విజయలక్ష్మి, వద్దిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012-13 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.