యాదగిరిగుట్ట, మే 26 : అనుమతి లేని విత్తనాలతో పాటు నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏడీఏ శాంతి నిర్మల హెచ్చరించారు. సోమవారం యాదగిరిగుట్ట మండల వ్యవసాయాధికారి ఐ.సుధారాణితో కలిసి మండల పరిధిలోని విత్తన డీలర్ షాపులను తనిఖీ చేశారు. స్టాక్ రిపోర్టు, స్టాక్ బోర్డు, విత్తన నిలువలను పరిశీలించారు. మండలానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పరుగుల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మార్పీ ప్రకారమే విత్తనాలు విక్రయించాలని షాపుల యజమానులను సూచించారు. అధిక ధర విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.