నేరేడుచర్ల, ఆగస్టు 13: భారీ వర్షాలతో లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరి కొన్నిచోట్లు కల్వర్టులపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందుల ఏర్పాడ్డాయి, పంట పొలాలు నీట మునిగాయి. నేరేడుచర్ల మండలంలో 75.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
జాన్‌పహాడ్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న లోలెవెల్ కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బైపాస్ వెంట నిరుపేదలు వేసుకున్న గుడిసెలు నీట మునిగాయి. పెంచికల్‌దిన్న పంచాయతీ పరిదిలోని ఘంటవారిగూడెం-నేరేడుచర్ల రహదారిపైన ఉన్న వంతెన పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. చిల్లేపల్లి గ్రామ సమీపంలోని ముసీనది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎస్ఐ రవీందర్ కల్వర్టులు, రహదారులను పరిశీలించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భూదాన్పోచంపలి,్ల ఆగస్టు 13 : భారీ వర్షాలు కురుస్తున్నందున మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు- రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, జరిగినా సమాచారం వెంటనే చేరేలా చూడాలని, ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
నిలిచిన రాకపోకలు
మిర్యాలగూడ, ఆగస్టు 13: నియోజకవర్గంలో కురుస్తు న్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో అడవిదేవులపల్లి రహదారిపై లావూడితండా-రామన్నపేటల మధ్య ఉ న్న లోలెవల్ వంతెనపై భారీ గా వరద కొనసాగుతుంది.
ఉధృతంగా పాలేరు వాగు
మోతె, ఆగస్టు 13: మండల పరిధిలోని కూడలి, నరసింహాపురం, ఉర్లుగొండ సమీపంలో ఉన్న పాలేరు వాగు వర్షానికి పొంగిపొర్లుతోంది. దీం తో కూడలి, రాముని తం డా వద్ద ఏర్పా టు చేసిన చెక్ డ్యామ్ నుంచి వరద ఉధృతంగా ప్రహిస్తుంది.
రఘునాథపాలెం – మఠంపల్లి రాకపోకలు బంద్
మఠంపల్లి, ఆగస్టు 13: మండలకేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు, జలమయమయ్యాయి. రఘునాథపా లెం వెళ్లే దారిలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. దీం తో రఘునాథపాలెం, గుండ్లపల్లి, చింతలపాలెం, మేళ్ళచెరువు మండలాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
తగ్గని వరద..
అర్వపల్లి, ఆగస్టు 13: మండలంలోని పలు గ్రా మాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. పొలాల్లో నిలిచిన నీటిని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.