కోదాడ, డిసెంబర్ 06 : కోదాడ కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మిశారద తెలిపారు. శనివారం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రాధాకృష్ణ చౌహాన్‌తో కలిసి కోదాడ కోర్టు భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అదేవిధంగా ప్రస్తుత కోర్టు హాల్స్, నూతన కోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కోదాడ కోర్టులో కనీస సౌకర్యాలు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. ఇరుకైన గదుల్లో కోర్టుల నిర్వహణ చాలా ఇబ్బందులతో కూడుకుని ఉందన్నారు.
అందుకోసం నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి, తక్కువ సమయంలో బిల్డింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అప్పటివరకు చిన్నచిన్న రిపేర్లు చేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. భవన నిర్మాణం కోసం జిల్లా కోర్టు వైపు నుండి ఒక కమిటీ వేసి పనుల పర్యవేక్షణ చూస్తామన్నారు. పి.పి లకు ఒక రూమ్, కక్షిదారులు నిలబడేందుకు, నీడ కోసం ఒక షెడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కోదాడకు జిల్లా అదనపు న్యాయస్థానం ఇవ్వాలని, మోతె మండలంను కోదాడ కోర్టుల పరిధిలో కలపాలని, నాలుగు కోర్టులకు సరిపడా స్టాఫ్‌ను కేటాయించాలని బార్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్, జూనియర్ సివిల్ జడ్జిలు కె.భవ్య, ఎం.డీ ఉమర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, హుస్సేన్, నవీన్, చలం, ధనలక్ష్మి, రమేశ్, సీనియర్ న్యాయవాదులు వై.సుధాకర్ రెడ్డి, మేకల వెంకటరావు, దేవబత్తిని నాగార్జున రావు, పాలేటి నాగేశ్వరరావు, గట్ల నర్సింహారావు, కొండల్ రెడ్డి, ఈదుల కృష్ణయ్య, సాధు శరత్ బాబు, వి.రంగారావు, నాళం రాజయ్య, సంపేట సుధాకర్, రహీం, రామిరెడ్డి, ఏ.పి.పి.లు గౌస్ పాషా, కారింగుల కళ్యాణి, ఆర్ అండ్ బి అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Kodada : కోదాడ కోర్టులో వసతుల కల్పనకు చర్యలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి