భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 11 : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రాష్ర్ట స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. మొదటి, రెండోరోజు 14 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించగా, మూడో రోజు ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. అనంతరం విజేతలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందజేశారు.
ఫైనల్ పోటీల్లో పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో కరీంనగర్, ద్వితీయ రంగారెడ్డి, జాయింట్ విన్నర్స్‌లో వరంగల్, హైదరాబాద్ జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో నల్లగొండ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ, మహబూబ్‌నగర్ జట్టు తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. చతుర్థి స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయి. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఖోఖో అసోసియేషన్ కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్‌బాబు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, సభ్యుడు రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.