మర్రిగూడ/చండూరు(గట్టుప్పల) : గట్టుప్పల మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గట్టుప్పల గ్రామానికి చెందిన పెద్దగోని రాఘవేందర్ గౌడ్-దీపిక దంపతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కలిసేలా వాళ్ల ఏడాది బాబుకు మంత్రి కేటీఆర్ చంద్రశేఖర్‌గౌడ్ అని నామకరణం చేశారు. ఉద్యమకారుడు అయిన రాఘవేందర్ గౌడ్ ఏడాది కాలంగా తన కుమారుడికి కేటీఆర్‌తో నామకరణం చేయించాలని ఎదురు చూశాడు. శుక్రవారం అవకాశం దొరకడంతో రాఘవేందర్ దంపతులిద్దరూ కేటీఆర్‌ను కలిసి పేరు పెట్టాల్సిందిగా కోరారు. మంత్రి కేటీఆర్ బాబును స్వ యంగా ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ పేరు వచ్చేలా చంద్రశేఖర్‌గౌడ్ అని నామకరణం చేశారు. దాంతో బాబు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఫార్మా కంపెనీ అనుమతుల రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి కేటీఆర్
మునుగోడు రూరల్, (గట్టుప్పల): గట్టుప్పల- పుట్టపాక గ్రామాల మధ్య నిర్మించ తలపెట్టిన కాంతి ఫార్మా లేబొరేటరిస్ అనుమతులు రద్దు చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి గట్టుప్పల సభావేదికపై ఆదేశించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం గట్టుప్పల రాగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అఖిల పక్ష కమిటీ నాయకులు ఫార్మా కంపెనీ వల్ల పది గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడే అవకాశం ఉందని దృష్టికి తీసుకు రాగా మంత్రి వేదికపైనే ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, గట్టుప్పల సర్పంచ్ ఇడం రోజా, పుట్టపాక సర్పంచ్ సామల భాసర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం, మహేశ్‌గౌడ్, వెంకటేశ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మారయ్య, సత్తయ్య, గీత, శ్రీశైలం, అఖిలపక్ష కమిటీ నాయకులు కే. మల్లేశం, గోపాల్, బీ. మల్లేశం పాల్గొన్నారు.