Union Budget : ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం’
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో..
తుంగతుర్తి, ఫిబ్రవరి 02 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన వ్యవసాయ రంగం, రైల్వే, విమానయాన, ఇలా పలు రంగాలకు నిధులు కేటాయించ లేదన్నారు. ప్రజలకు ఉపాధి కల్పనా రంగంలో కూడా సరియైన నిధులు కేటాయించడం బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి 8 మంది, బిజెపి నుండి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే ఉత్సవ విగ్రహాల వలె పార్లమెంట్లో మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు తునికి సాయిలు గౌడ్, గోపగాని రమేష్, చింతకుంట్ల భాస్కర్, గోపగాని వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

