నల్లగొండ, నవంబర్ 14 : పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (రూ.15,20,500) అందజేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అర్హులైన వారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.