నల్గొండ విద్యా విభాగం (రామగిరి )మార్చి 4: నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్దులు ఫెస్ట్ లో పాల్గొన్నారు.
వరుస విజయాల పరంపర
ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ సూర్యాపేట సివిల్ &కంప్యూటర్ సైన్స్ విభాగాలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ – నాగార్జున సాగర్ సివిల్ విభాగం ,ప్రభుత్వ పాలిటెక్నిక్ – తిరుమలగిరి-సివిల్ విభాగం & ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ కంప్యూటర్ సైన్స్ & సివిల్ విభాగాల్లో పాల్గొన్నాయి సివిల్ లో విభాగంలో ప్రథమ స్థానం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ – సూర్యాపేట విద్యార్థినులు దక్కించుకోగా.. ద్వితీయ స్థానం ప్రభుత్వ పాలిటెక్నిక్ ,నాగార్జున సాగర్ విద్యార్దులు దక్కించుకొన్నారు.కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ – నల్లగొండ విద్యార్దులు ప్రథమ స్థానం దక్కించుకోగా,ద్వితీయ స్థానం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ – సూర్యాపేట విద్యార్థినులు దక్కించుకున్నారు
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు వెలికితీతకే…
ఈ సందర్భంగా నల్గొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ నర్సింహారావు మాట్లాడుతూ.. సృజన టెక్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంతోపాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి గొప్ప అవకాశం కల్పించడం జరుగుతోందని అన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించబడతాయని అన్నారు.
జిల్లాస్థాయిలో నిర్వహించిన టెక్ ఫెస్ట్ ప్రథమ, ద్వితీయ స్థానం దక్కించుకొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిని ప్రిన్సిపల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మరింత సృజనాత్మకత ప్రదర్శించి మెరుగైన స్థానం దక్కించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగం జిల్లా కోఆర్డినేటర్ విజయ శారద, కంప్యూటర్ సైన్స్ విభాగం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమాధురి, హెచ్వోడీలు,అధ్యాపకులు పాల్గొన్నారు