నల్లగొండ రూరల్, జులై 11 : మహిళలు స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం అందిస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఏపీడీ శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రుణాలు పొంది మహిళలు నిర్వహిస్తున్న యూనిట్లను ఆయన పరిశీలించారు. కారం మిల్లు, కిరాణం, స్టోన్ పై ఆర్ట్ యూనిట్లను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, సకాలంలో రుణాలు చెల్లించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎల్ ఎం సభ్యులు సలీం కుమార్, ఎంపీడీఓ సిరిపురం వెంకట్రెడ్డి, ఏపీఎం వినోద, సీసీలు నరసింహ, అంజయ్య, శారద, శైలజ, లక్ష్మమ్మ, ధనమ్మ, హిమబిందు పాల్గొన్నారు.