కోదాడ, ఆగస్టు 15 : 1,200 మంది బిడ్డల అమరత్వంతో పాటు మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఆత్మత్యాగంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాంతాచారి జయంతిని కోదాడలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేయడంతో పాటు 250 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగేంద్ర చారి, వీరాచారి, శ్రీధర్ చారి, హనుమాన్ చారి, ఉపేంద్ర చారి, నాగ కృష్ణమాచారి, రామబ్రహ్మం, సాయి నరేశ్ చారి పాల్గొన్నారు.