వైభవంగా.. రాములోరి కల్యాణం
శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభ ముహూర్తాన సీతారాముల కల్యాణం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన రాములోరి కల్యాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
- ఉమ్మడి జిల్లాలో ఘనంగా వేడుకలు
- ఊరూరా ముత్యాల తలంబ్రాల పంపిణీ
రామగిరి, మార్చి 27: శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించారు. అభిజిత్ లగ్న శుభ ముహూర్తాన సీతారాముల కల్యాణం నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన రాములోరి కల్యాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
రామగిరిలో నగరమేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్చార్జి కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, జెడ్పీసీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవిత దయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. నల్లగొండలోని తులసీనగర్ శ్రీభక్తాంజనేయస్వామి దేవస్థానం, పాతబస్తీ శ్రీసంతోషిమాత ఆలయం, పలు కాలనీల్లోని రామాలయాలు, శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. జిల్లాలోని ఊరూరా శ్రీరామనవమి వేడుకులను ఘనంగా నిర్వహించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

