రామగిరి, జూలై 07 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష తెలిపారు. అన్ని కోర్సులలో కలిపి మొత్తం 111 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) గ్రూప్లో ఎస్సీ లో 7 సీట్లు, ఎస్టి కేటగిరిలో 1 సీటుతో కలిపి మొత్తం 8 సీట్లు ఎంపీసీఎస్ గ్రూపులో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
– బిఎస్సీ (ఎం ఎస్ డి ఎస్ / ఎంఎస్ సి ఎస్) గ్రూపులో ఎస్సీ లో 25 సీట్లు, మైనారిటీ 1 సీటుతో కలిపి మొత్తంగా 26 సీట్లు ఉన్నాయి.
– బీఎస్సీ (బి జెడ్ సి) గ్రూపులో ఎస్సీ లో 12 సీట్లు, ఎస్టి లో 1 సీట్లతో కలిపి 13 సీట్లు ఉన్నాయి.
– బి ఎస్ సి (ఎం జెడ్ సి) గ్రూపులో ఎస్సీ లో 18 సీట్లు, ఎస్టి లో 2 సీట్లుతో కలిపి మొత్తంగా 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
– బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) లో ఎస్సీ లో 8 సీట్లు, మొత్తంగా 8 సీట్లు ఉన్నాయి.
– బీకాం (బిజినెస్ అనలైటిక్స్) లో ఎస్సీ లో 16 సీట్లు, ఎస్టి లో 2 సీట్లు, మైనారిటీ లో 1 సీటు తో కలిపి 19 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
– బీఏ (హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్) కోర్సులో ఎస్సీ లో 15 సీట్లు, ఎస్టి లో 1 సీటు, మైనారిటీ లో 1 సీటుతో కలిపి 17 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
పై కోర్సులలో వివిధ క్యాటగిరిలలో ఖాళీగా ఉన్న సీట్లకు అడ్మిషన్ల కొరకు కళాశాలలో సంప్రదించవలసినదిగా తెలిపారు. ఆసక్తి గల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 2026 జనవరి తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ జిరాక్స్, ఇంటర్మీడియట్ టీసీతో పాటుగా రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తో నేరుగా కళాశాలలో హాజరై అడ్మిషన్లు పొందవచ్చు అని తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.