రామగిరి, జులై 01 : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్.నరసింహారావు తెలిపారు. పాలీసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, పదో తరగతి (ఎస్ఎస్సీ) ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని పేర్కొన్నారు.
01 జూలై నుండి 03 జూలై 2026 వరకు నేరుగా నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలు కళాశాలలోనే అందుబాటులో ఉంటాయి.
04 జూలై 2026 (శనివారం) కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడతాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిర్ణీత తేదీన తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
కంప్యూటర్ ఇంజనీరింగ్ – 2
ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ – 11
సివిల్ ఇంజనీరింగ్ – 17
మెకానికల్ ఇంజనీరింగ్ – 26
– పాలీసెట్–2026 ర్యాంక్ కార్డు (అర్హత సాధించిన వారికి)
– ఎస్ఎస్సీ మార్కుల మెమో
– 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
– ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టి.సి.)
– కుల ధ్రువీకరణ పత్రం (వర్తించిన వారికి)
– నివాస ధ్రువీకరణ పత్రం
– ఇతర సంబంధిత ధ్రువపత్రాలు
– పై అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు
స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని ప్రిన్సిపల్ తెలిపారు. డిప్లొమా విద్య ద్వారా ఉన్నత విద్య, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా లభిస్తాయని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నల్లగొండ
📞 82475 47858
📞 88860 95454