ఎన్నాళ్లని పాత బండి మీద తిరుగుతం, కొత్త బండి కొందాం అనుకుంటున్నారా?
మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన లగ్జరీ కార్ల గురించి సరైన సమాచారం దొరక్క ఇబ్బంది పడుతున్నారా?
వ్యవసాయ పనుల కోసం తక్కువ వడ్డీకి ట్రాక్టర్ పొందాలనుకుంటున్నారా?
రండి.. బహుమతులు గెలుచుకోండి
నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికలు ఏర్పాటుచేస్తున్న ఆటో షో నేటి నుంచి రెండ్రోజులపాటు కొనసాగనున్నది. శనివారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య
అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈ రెండ్రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని ఆటో మొబైల్ కంపెనీలు తమ ప్రదర్శనకు అందుబాటులో ఉంచనున్నాయి.
ఆటో షోకు హాజరయ్యే సందర్శకులకు ప్రత్యేక బహుమతులు ఉంటాయి. ప్రతి మూడు గంటలకు ఒకసారి
తీసే లక్కీడ్రాలో విజిటర్స్‌కు హైదరాబాద్ కేఫ్ నిలోఫర్ బహుమతులు అందించనున్నది. చివరి రోజు మెగా డ్రాలో విజేతకు నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే తరఫున స్మార్ట్ మొబైల్ ఫోన్‌ను అందించడం
జరుగుతుంది.
..అయితే, ఈ అవకాశం మీ కోసమే. తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలుగా జనాదరణ పొందిన నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహిస్తున్న ఆటో షో మీకు ఆహ్వానం పలుకుతున్నది. ప్రముఖ కార్, బైక్, ట్రాక్టర్ కంపెనీలన్నింటినీ వేదికగా మీ ముందుకు తెస్తున్నది. నాలుగు షోరూమ్‌లు తిరుగాల్సిన పని లేదు. ఎవరెవరినో ఆరా తీయాల్సిన అవసరం లేదు. నల్లగొండ నాగార్జున కాలేజీ గ్రౌండ్లో మీ కోసమై ఎదురుచూసే ఆటో షోకు రండి. ఆటోమొబైల్స్‌కు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నచ్చిన వాహనాన్ని బుక్ చేసుకుని స్పెషల్ డిస్కౌంట్లో పొందవచ్చు. ఉన్నచోటే తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేసేందుకు ప్రముఖ బ్యాంకులు సైతం సిద్ధంగా ఉన్నాయి.
– నల్లగొండ, డిసెంబర్ 9
అన్ని రకాల వాహనాలతో..
రెండు రోజులపాటు నిర్వహించే ఆటో షోలో అన్ని కంపెనీలకు సంబంధించిన టూ వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు వాటికి సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగనున్నది. ఈ రెండు రోజుల్లో బైక్స్, కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి బుకింగ్ చేసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్ అందనుంది. గడిచిన దశాబ్ద కాలంగా ఒకే దగ్గర అన్ని రకాల వాహనాల ప్రదర్శన, కొనుగోళ్లు లేకపోవడంతో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఈ సౌకర్యం కల్పిస్తున్నది. ప్రధానంగా బైక్‌లతోపాటు, కార్లు, ట్రాక్టర్ల షోరూమ్‌లు నల్లగొండలోనే ఉండగా వాటన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చి వినియోగదారుల బుకింగ్స్‌ను సులభతరం చేసింది.
నూరు శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకర్లు
కాలానుగుణంగా ఆదాయ వనరులు పెరుగడంతో టూ వీలర్లతోపాటు ఫోర్ వీలర్ల వినియోగం పెరిగింది. సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరుగడంతో ట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. ట్రాక్టర్ల విడి భాగాలు సైతం చాలా అవసరమవుతున్నాయి. ట్రాక్టర్లు ప్రతి సంవత్సరం 3వేల దాకా విక్రయిస్తుండగా కార్లు సుమారు 2వేలు, బైకులు అంచనాలకు మించి అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు సైతం నూటికి నూరు శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు కేంద్ర సహకార బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాహనాలకు పూర్తి స్థాయిలో ఫైనాన్స్ కల్పిస్తున్నాయి.
అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ
అన్ని బ్యాంకుల కన్నా ఎస్బీఐలో తక్కువ వడ్డీ రేటుకే వాహనాల ఆన్‌రోడ్ ధరపై 90శాతం ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో డాక్యుమెంటేషన్ వేగంగా జరుగుతుంది. డిజిటల్ విధానంతో ప్రాసెసింగ్ విధానం సులభంగా ఉంటుంది. మేము ఇచ్చే లోన్లలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కార్ల లోన్లే ఎక్కువగా ఉంటాయి. వాహనాల లోన్లు కావలసిన వారు ఎస్బీఐని సంప్రదిస్తే సులువుగా తక్కువ వడ్డీ రేటుకే లోన్ లభిస్తుంది.
– జి.విజయ్‌కుమార్, రీజినల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నల్లగొండ
బ్యాంక్ బరోడాలో కార్ల లోన్ల వడ్డీ 8.5శాతమే మా బ్యాంక్‌లో కార్ల లోన్లపై
వడ్డీ 8.5 శాతం మాత్రమే. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. సులభమైన ప్రాసెసింగ్ విధానం ఉంటుంది. డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన వెంటనే లోన్ మంజూరు చేస్తాం. తక్కువ డౌన్ పేమెంట్‌కే రుణాలు ఇస్తున్నాం.
– వీరన్న నాయక్, బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నల్లగొండ
ట్రాక్టర్ రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఇతర బ్యాంకులు, ఫైనాన్స్‌ల కన్నా ఎంతో తక్కువ వడ్డీ రేటుకు రైతుల సౌకర్యార్థం కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ట్రాక్టర్ లోన్లు ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులు కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ట్రాక్టర్ రుణాలు తీసుకొని లబ్ధిపొందాలి.
– గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా