ముంబై, అక్టోబర్ 3: ఈ నెల 2న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సీజేపీ బహిరంగ నిరసనలో మైనర్లను సమీకరించడం, వారు పాల్గొనేలా చేయడంపై ముంబై పోలీసు చీఫ్‌కు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ ) నోటీసులు జారీ చేసినట్టు శనివారం అధికారులు తెలిపారు. అలాగే తీసుకున్న చర్యల నివేదికలను వారంలోగా తమకు సమర్పించాలని ఆదేశించింది.
ఈ ఆందోళనలో త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు పట్టుకుని పాల్గొన్న మైనర్ల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై సేవా న్యాయ ఉథాన్ ఫౌండేషన్, మరో సంస్థ చేసిన ఫిర్యాదుల్లో ఈ ఘటనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో సంబంధం ఉన్నట్టు పేర్కొన్నారు. వారే పిల్లలను ఈ ఆందోళనలో భాగస్వాములను చేశారని తెలిపారు. పోలీసుల ఎదుటే ఇది జరిగినా దానిని ఆపడానికి వారు యత్నించ లేదని తెలిపారు.