కొండమల్లేపల్లి, నవంబర్ 7: ఆపదలో వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులకు అండగా నిలవాలని, వారి సమస్యలను పరిష్కరిం చి భరోసా కల్పించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్‌డెస్క్, స్టేషన్ రైటర్, లాకఫ్, ఎస్‌హెచ్‌వో రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. నమోదవుతున్న కేసులు, రికార్డులను పరిశీలించారు.
పరిసరాల స్థితిగతులను ఎస్ఐ అజ్మీర రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్యం వహించొద్దన్నారు. పోలీసులు ప్రతి రోజూ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. జాప్యం చేయకుండా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. 100 డయల్ కాల్స్‌కి తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాల నివారణకు స్కూల్స్, కళాశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్షించి త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, సీఐ నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.