సూర్యాపేట టౌన్, నవంబర్ 8: మహిళలు, యువతులు తమపై జరిగే వేధింపులను ఉపేక్షించకుండా ధై ర్యంగా ఫిర్యాదు చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడే నేరాల ను నిర్మూలించవచ్చన్నారు. మహిళల రక్షణ కోసమే షీటీమ్స్ కృషి చేస్తున్నాయన్నారు.
జిల్లాలో సూర్యాపేట, కోదాడ డివిజన్ పరిధిలో షీటీమ్ బృందాలు పని చేస్తున్నాయని, షీటీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్న చట్టాలపై, డయల్ 100, టీ సేఫ్ యాప్, మహిళల భద్రత, రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని ఆన్లైన్, క్యూఆర్ కోడ్, వా ట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా పోలీసుల షీటీం నం. 8712686056 కు కాల్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా కానీ సందేశం పంపించవచ్చన్నారు. అలాగే 100కు డయల్ చేసి తక్షణ పోలీసు సాయం పొందవచ్చన్నారు.