ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. భూదాన్ పోచంపల్లిలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 25 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. భూదాన్ పోచంపల్లిలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచే పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్నవారందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాతక లింగస్వామి, నాయకులు సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, చిట్టిపోలు శ్రీనివాస్, చిల్లర జంగయ్య, కర్ణాటి రవీందర్, గునీగంటి మల్లేశంగౌడ్, ముత్యాల మహిపాల్‌రెడ్డి, ఆర్ల లింగస్వామి, రావుల యాదగిరి, నోముల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

