నాగార్జునసాగర్, మే 28 : నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నాగార్జునసాగర్‌లో బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ బుధవారం స్థల పరిశీలన చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఇంట్రిగేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలం సేకరణకై పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే పెద్దవూర మండలంలోని చలకుర్తి గ్రామంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భూములను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించారు.
బుధవారం నాడు నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని బీసీ గురుకుల పాఠశాల వెనుక భాగంలో, నాట్కో ఫార్మా క్వార్టర్స్ పక్కన ఇంట్రిగేటెడ్ స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలన చేశారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు, పెద్దవూర తాసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగార్జునసాగర్ అటవీ శాఖ అధికారులు రాఘవేంద్రరావు, రమేశ్ పాల్గొన్నారు.