కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 25 : దేవరకొండ నియోజకవర్గంలో ఆర్టీఏ (రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) కార్యాలయం నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, డీటీసీ డాక్టర్ వాణి, డీటీఓ లావణ్య, డిప్యూటీ తాసీల్దార్ ప్రశాంత్, ఎంవీఐ కొండయ్య, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.