గట్టుప్పల్, మార్చి 11 : గట్టుప్పల్ మండలానికి మంజూరైన నూతన పీహెచ్సీ భవన నిర్మాణానికి మండల పరిధిలోని వెల్మకనే రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం మునుగోడు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వర్రావు, స్థానిక తాసీల్దార్ కె.రాములు పరిశీలించారు.
ఈ సందర్భంగా పీహెచ్సీ ప్రారంభమైతే ప్రజలకు వైద్య సదుపాయాలు చేరువ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం రాజు, పంచాయతీరాజ్ ఏఈ సతీశ్‌రెడ్డి, గట్టుప్పల్ సబ్ సెంటర్ డాక్టర్ అశోక్, పంచాయతీ కార్యదర్శి ఎండి షఫీ, దండు యాదగిరి రెడ్డి, సామల యాదయ్య పాల్గొన్నారు.