శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్ర వరకు రైతన్నలు బిజీ బిజీగా పొలం పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ల సాయంతో పొలాన్ని దమ్ము చేస్తూ.. వరాలు తీసే పనులు చేస్తున్నారు. ఆయకట్టు కింద ఎక్కడ చూసినా సాగు సందడి నెలకొన్నది. సాగర్ను తలపించేలా ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు.