నల్లగొండ, సెప్టెంబర్ 9: నల్లగొండలోని ఎస్బీఐ- ఆర్సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్)లో మహిళలపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు, ఆక్కడ ఉద్యోగాలు చేస్తున్న, శిక్షణకు వస్తున్న మహిళలపై కన్నేసి ఇబ్బందులు పెడుతున్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుండటం గమనార్హం. సంస్థలో కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగినిపై ఇటీవల కన్నేసిన ఓ కామాంధుడు ఆమెను టార్గెట్ చేస్తూ పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. నువ్వు పూలు పెట్టుకుంటే బావుంటావు..ముద్దుగా తయారై కనిపించు…పురుష ఉద్యోగులు ఫీల్డ్‌కు వెళ్లిన సమయంలో నువ్వు ఆఫీసులోనే ఉండాలి.. అంటూ వెకిలి మాటలతో ఇబ్బందులు పెడ్తున్నాడని తెలిసింది. ఈ విషయం సదరు ఉద్యోగిని తన సమీప బంధువుకు తెలియచేయటంతో రెండు రోజుల క్రితం వారు ఆఫీసుకు వచ్చి దేహశుద్ధి చేసినట్లు తెలిసిం ది. అయితే ఇది జీర్ణించుకోలేని సదరు వ్యక్తి నల్లగొండ వన్‌టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉం డగా ఇటీవల అక్కడ టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
ఈసందర్భంగా ఓ మహిళా ట్రైనర్‌ను సదరు వ్యక్తి తన బెడ్రూంలోని బెడ్డును సర్దమని..కాసేపు కూర్చోమని.. నీకేం కా వాలో చెప్పు.. అని అనడంత ఆమె ఎవరికి చెప్పుకోలేక అక్కడే ఉన్న మరో మహిళా ఉద్యోగినికి చెప్పుకొని బోరున విలపించినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడకు శిక్షణ పొందేందుకు వస్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆయనపై ఎస్బీఐలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోగా, పోలీస్టేషన్ లో సద రు వ్యక్తి ఫిర్యాదునే సాకుగా తీసుకోని ఖాకీలు విచారణ చేపట్టడం గమనార్హం. గతంలో లైంగిక వేధింపుల కేసులో షీటీమ్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేసి, బయట పడినా మళ్లీ అదే తంతు కొనసాగుతోంది. శిక్షణకు వెళ్లాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది.