నీలగిరి, అక్టోబర్ 7:ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వం చించి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన సం ఘటన మంగళవారం నల్లగొండలో కలకలం సృష్టించింది. కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తానన్న బిడ్డ కండ్లముందే శవంగా కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..నల్లగొండ మండలంలోని గుట్టకింద అన్నా రం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ ట్రాక్టర్ డ్రైవ ర్. వృత్తిలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో పనులు చేస్తున్న క్రమంలో బాలికతో పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ఆ బాలిక నల్లగొండలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. బాలిక రోజూ కళాశాలకు వచ్చి వెళ్తున్న క్రమంలో వారి పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది.
దసరా సెలవుల అనంతరం సోమవారం కళాశాలకు రావడంతో ఆ బాలికతో కృష్ణ మాట్లాడి తన స్నేహితుడి గదికి వెళ్దామని చెప్పడంతో నిరాకరించింది. తిరిగి మంగళవారం ఉదయం 8 గం టలకు యథావిధిగా ఇంటి నుంచి బయల్దేరి నల్లగొండకు చేరుకుంది. సుమారు 8.30 గంటల ప్రాంతంలో ఆ బాలికను కలిసిన కృష్ణ మాయ మాటలు చెప్పి పట్టణంలో తన స్నేహితుడు ఉం టున్న డైట్ కళాశాల పకనే ఉన్న షమ్స్ నగర్ రోడ్డు నంబర్ 8లోని ఒక రేకుల గదికి తీసుకెళ్లాడు. అకడ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. మైనర్ బాలిక హత్యకు అతడి స్నేహితుడు కూడా సహకరించినట్లు తెలిసింది.
బాలిక తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేర కు డీఎస్పీ శివరాంరెడ్డి, ఇన్చార్జి సీఐ వేమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదు లు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి ప్రాంతాన్ని పరిశీలించి లైంగిక దాడి, హత్య జరిగిన తీరును గమనించి, ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడిపై లైంగిక దాడి, హత్య, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం నల్లగొండ ప్రభు త్వ దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. నిందితుడు గడ్డం కృష్ణపై లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు చేయాలని, ఈ కేసు లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేపట్టాలని ఆదేశించారు.