సూర్యాపేట టౌన్, డిసెంబర్ 22 : అకాల మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు భద్రతా ఇన్స్యూరెన్స్ స్కీమ్ అండగా ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. నూతనకల్ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమాని నాయక్ కుటుంబానికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ప్రయాణ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హెల్మెట్ విధిగా ధరించాలన్నారు. విధులకు ముందుగా బయల్దేరి సురక్షితంగా గమ్యం చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, అడ్మిన్ ఆర్ఎస్ఐ కె.అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.