తుంగతుర్తి, మే 19 : యాదవుల ఆరాధ్య దైవం సౌనమ్మ తల్లి అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో జరుగుతున్న సౌనమ్మ పండుగ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ మాట్లాడుతూ.. సౌనమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆరోగ్యకరంగా చూడాలని కోరారు. అనంతరం యాదవ సోదరులతో కలిసి వారి సాంప్రదాయ కటార్ లతో విన్యాసాలు చేసి, భేరీలు మ్రోగించి భక్తులను ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు దొంగారి శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, మట్టిపల్లి వెంకట్, కడారి దాసు, భగవాన్, బజ్జ కిరణ్, కొండగాడుపుల వెంకటేష్, శ్రావణ్ పాల్గొన్నారు.

యాదవుల ఆరాధ్య దైవం సౌనమ్మ తల్లి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్