– తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్
– కతాల్గూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 02 : బడుగు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు. గురువారం నల్లగొండ శివారు ప్రాంతంలోని కతాల్గూడెంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ధీరత్వానికి, ధైర్యానికి సర్దార్ సర్వాయి పాపన్న మరో పేరు అని కొనియాడారు. నేడు బీసీల అభ్యున్నతి కోసం ప్రతి బీసీ బిడ్డ పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కనీస న్యాయం జరగడం లేదని, దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చే విధంగా పాలకులపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి బీసీపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మారగోని భవాని గణేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, దండంపల్లి సత్తయ్య, దూసరి కిరణ్, రేగట్టే లింగస్వామి, నరేష్ పాల్గొన్నారు.