గుర్రంపూడ్, మార్చి 21: మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మండల స్థాయి బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు నగదు బహుమతి అందజేశారు. శనివారం పోటీలు ముగియడంతో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 20 జట్లు పాల్గొ నగా.. వెలుగు సత్యనారాయణ, పాతనబోయిన భాస్కర్ జంట మొదటి బహుమతి గెలుపు పొందింది.
మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేడి వెంకన్న ప్రథమ విజేతలకు రూ. 10,016 అందజేశారు. ద్వితీయ విజేతలుగా నిలిచిన చలమల్ల మనోహర్, వడ్డేగోని సైదులుకు గుర్రంపోడు గ్రామ ఉప సర్పంచ్ మేకల కోటిరెడ్డి రూ.6,016 ప్రదానం చేశారు. తృతీయ విజేతలు బైరు కోటేశ్వరరావు, మహేష్ జంటకు బొడ్డుపల్లి జగదీష్ రూ.4,016 అందజేశారు. ఈ బహుమతి ప్రదానోత్సవంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.