చందంపేట(దేవరకొండ), ఆగస్టు 24: గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నా రు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నేరేడుగొమ్ము, డిండి, దేవరకొండ మం డలాల ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం కావడంతో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని గ్రామపంచాయతీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఎంపీడీఓలు డానియేల్, నీలిమ, సరోజ, నాయకులు దొంతినేని వెంకటేశ్వర్రావు, హరికృష్ణ, కార్యదర్శులు తదితరు లు పాల్గొన్నారు.
గంగానదికి పూజలు
చందంపేట : నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలోని కృష్ణా పుష్కారాల ఘాట్ సమీపంలోని గంగా సమేత శ్రీ కేదరేశ్వరస్వామి గంగానది హారతిలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని హారతి ఇచ్చారు. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ బాలూ నాయక్, మాజీ ఎంపీటీసీ యుగేందర్‌రెడ్డి, ముక్కమల వెంకటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, లోకసాని కృష్ణ, బావోజి జీవన్, పాపానాయక్, యాదయ్య పాల్గొన్నారు.
ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల తనిఖీ
దేవరకొండరూరల్ : మండలంలోని పెంచికల్‌పహాడ్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బాలూనాయక్ శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, మెనూ, పరిసరాల పరిశుభ్రత, విద్యపై ఆరా తీసి, పలు విషయాలు తెలుసుకున్నారు. నీటి సమస్య ఉపాధ్యాయులు తెలుపడం,అక్కడి నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారితో ఫోన్లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, విద్యార్థులు నాయకులు కొర్ర రాంసింగ్ పాల్గొన్నారు.