
రామగిరి: సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని అదేవిధంగా భగవద్గీతపై అవగాహన కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ముసాపేట రామరాజు అన్నారు. డిసెంబర్ 14,2021న నిర్వహించే లక్ష యువ గళా ర్చన కార్యక్రమం కోసం ప్రజల చైతన్యం, అవగాహనకై ఆయన సోమవారం నల్లగొండకు వచ్చారు. దీనిలో భాగంగా లక్ష యువ గళార్చన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి 15 నుంచి 40సం. వయస్సు కలిగిన వారు www.gitarchana.com వెబ్‌సైట్‌ల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారు భగవద్గీతలోని 40 శ్లోకాలు అధ్యయ నం చేసి డిసెంబర్ 14న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మందితో ఒకే గొంతుతో భగవద్గీతలోని శ్లోకాలు పారాయానం చేయాలన్నారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి యాదగిరిరెడ్డి, వీహెచ్‌పీ నల్లగొండ జిల్లా అధ్యక్షు డు కర్నాటి యాదగిరి, క్షేత్ర గోరక్ష ప్రముఖ్ యాదగిరిరావు, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ శివరాములు, వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా సహకార్యదర్శి తొట్టభానుప్రసాద్, విభాగ్ సంఘటన కార్యదర్శి కన్నెబోయిన వెంకట్, జిల్లా సహాయ కార్యదిర్శి జూకూరి సంపత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.